rediff ILAND
Welcome Guest, | Create your own iLand| Sign In  | New User? Get Started
BLOGS
iLand
Blogs
Friends/Contributors
Guestbook  
 
vijayaram reddy
Categories
Music
Religion
kavitha
Poetry
Travel
Friends
Writing
Mobile
Business
What is an RSS feed?
RSS Feed 
jeevitham.rediffiland.com/  
Wednesday 20 August, 2008
 12:10 | 16/Jul/2008 |  14 Comment(s)
  Add vijayaram reddy as Friend     Write to vijayaram reddy     Forward this link
BANDHINCHU - BAADHINCHAKU



నువ్వు వస్తావని నేను,

నేను పిలుస్తానని నీవు....

ఒకే ఒడ్డున ఎవరికీ

కాకుండా నిలుచున్నాం..

అడిగితే చెబుదామని నేను,

చెబితే విందామని నువ్వు.....

మనిద్దరి మధ్యన -

ఆహాల గోడలు

నిర్మించుకున్నాం.

మౌనం మాటలుగా మారి,

గుండెలోతుల్లో గొంతుకను-

దాచేసింది.

కనురెప్పల మాటున

దాగిన కలల రూపం-

చూసింది ఎవరు?

అందుకే నా ఆవేదనను -

ఇలా నివేదన చేస్తున్నాను..!

నా కళ్ళ వాకిళ్ళలో స్వప్నాల

తోరణాలు కట్టి వేచివున్నాను-

నువ్వు వస్తావని...!

ఆశ పడ్డ మనసు -

భంగపడదు కదా.......!!

Category: kavitha | Permalink