rediff ILAND
Welcome Guest, | Create your own iLand| Sign In  | New User? Get Started
BLOGS
iLand
Blogs
Friends/Contributors
Guestbook  
 
vijayaram reddy
Categories
Music
Religion
kavitha
Poetry
Travel
Friends
Writing
Mobile
Business
What is an RSS feed?
RSS Feed 
jeevitham.rediffiland.com/  
Wednesday 20 August, 2008
 12:11 | 16/Jul/2008 |  16 Comment(s)
  Add vijayaram reddy as Friend     Write to vijayaram reddy     Forward this link
నువ్వేనా !

నువ్వేనా !

ఎలా వున్నావ్ ? నన్ను తలుచుకోటానికి కూడా వీలు కానంత బిజీ గా వున్నావా? ఎంత విచిత్రం! నీ

ప్రేమబడిలో నేను చేరినపుడు ఒద్దికగా ఓనమాలు నేర్పించావు. తెల్లటి కాగితం మీద నల్లటి అక్షరాలు

కావవి, మన ప్రనయాకాశంలో మెరిసే తారలంటూ చిన్న చిన్న లేఖలతో మొదలు పెట్టించి,

అందమైన కవితలు అలవోకగా రాసేంత భావుకతను నా మనసుకు అందించావు ఆనాడు. మరి

ఇప్పుడు? నీ నుండి జాబులు లేవు. జవాబులూ లేవు. టెలిఫోన్ లో బ్లాంక్ కాల్ పలకరింపుల ద్వారా

సుప్రభాతాలు, శుభ రాత్రులు ఎలా చెప్పుకోవడం అనేది నేర్పించావు నాడు. మరి ఇప్పుడో? నేను ఫోన్

చేస్తే "సారీ రా" బిజీ అంటూ కట్ చేస్తావు. "సెల్ ఫోన్ మన జీవితాల్లోకి వచ్హాక నువ్వు నా

హ్రిదయానికి మరింత దగ్గరగా వచ్హావురా. షర్టు జేబులో సెల్ ఫోన్ మ్రోగితే నువ్వు నా హ్రిదయం పై

తల వాల్చి కిలకిలా నవ్వినట్లే ఉంటుంది". అంటూనే ఎస్.ఎం.ఎస్ లతో నన్ను ఉక్కిరి బిక్కిరి

చేసావు. ఇప్పుడు ఎప్పుడు నీ సెల్ కి రింగ్ చేసినా స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. అదేమంటే మీటింగ్

లో ఉన్నానంటావు. నువ్వు నా నుండి మాత్రమే దూరమౌతున్నావా? లేక నీ నుండి నువ్వే

దూరమైపోతున్నావో ఒక్కసారి ఆలోచించు. నాకు దూరంగా ఉంది నువ్వు ఏం సాధి (సంపాది)

స్తున్నావో నాకు తెలియదు. నేను మాత్రం సర్వం కోల్పోఇనట్లు, స్వరం మూగపోయి, తీగ తెగిన వీణ

లా చైతన్యం కొల్పొఇ జీవచవంలా ఉన్నాను. నీ చల్లని పలకరింపుతో మన ప్రేమని మళ్ళీ

బ్రతికిస్తావని ఆసిస్తూ................

నీకేమీ కాలేక, కాలేని...... నీ.................

Category: Writing | Permalink