|
|
|
|
| Wednesday 20 August, 2008 |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
DONT BREAK YOUR HEAD
ప్రస్తుతం మీ పిల్లల చదువుల పరమావధి ఉద్యోగమే అయితే వారిని ఏ కోర్సులో చేర్చితే తొందరగా రాణించి, ఉద్యోగాన్ని పొందగలరో ఆలోచించండి. బలవంతపు కోర్సులను, వారి మేధస్సుకు మించిన కోర్సులను వారిచే చదివించి చివరకు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడెట్లు చేసుకోవడం ఈనాటి తల్లిదండ్రుల్లో ఎక్కువ శాతం ఉన్నారనేది విస్పష్టం. ఇక్కడ మీకన్ధరికి తెలిసిందే అయినా ఓ కధ చెప్పాలి. శివుడు, పార్వతి, వారి కుమారులయిన విఘణేశ్వరుని, సుబ్రమన్యుణ్ణి పిలిచి, ఎవరైతే ముందుగా ముల్లోకాలను మూడు సార్లు చుట్టి వస్తారో వారికి ప్రమధ గనాన్ని అప్పగిస్తామని చెప్పినవెంటనే సుబ్రమన్యుడు ఆలస్యం చేయకుండా నెమలి వాహనం సహాయంతో బయలుదేరి వెళతాడు. ఇక పోతే మన వినాయకుడికి ఎం చేయాలో అర్ధం కాక అంటే తన వాహనం చూస్తే ముషికం(ఎలుక), పైగా తనది భారీ కాయం. చివరికి ఆలోచించి - తల్లిదండ్రులను మించిన వేరే లోకాలు లేవని తలచి శివపార్వతుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి తన సోదరుని కంటే ముందుగా ఆ పోస్టుని కొట్టేయడం జరుగుతుంది.(అంటే ఇక్కడ వివేకం, సమయ స్పూర్తి బాగా పని చెసిన్దనె చెప్పాలి)
మీ పిల్లల చివరి గోల్ మంచి ఉద్యోగమే అయినప్పుడు అనవసరమైన కోర్సులు, కోచింగులు చదివించి మీ డబ్బు, అమూల్యమైన సమయం, శ్రమ వృధా అయిపోయి చివరికి ఏ క్లర్క్ గానో, కండక్టర్ గానో స్థిరపడి దాంతోనే సంతృప్తి పడాల్సి వస్తుంది. ఇక్కడ మీరిన్కొ విషయం గుర్తుంచోవాల్సి ఉంది. ఏ ప్రభుత్వ ఉదైగానికైనా (మరీ కొన్నింటికి తప్పించి) చివరకు ఐ.పి.ఎస్/ఐ.ఏ.ఎస్ లకు కూడా కావాల్సిన కనీస అర్హత "ఏదైనా డిగ్రీ'. ఉదాహరణకి మీ పిల్లల్ని ఓ ఐ.పి.ఎస్ లేదా ఐ.ఏ.ఎస్. చదివించాలనుకుంటే ఇంటర్మీడియేట్ తర్వాత బాగా పేరున్న ఒక మంచి కోచింగ్ సెన్ట్రర్ని - ఆది దెల్హి కావచు లేదా హైదరాబాద్ కానివ్వండి, అక్కడకు పంపించి పూర్తి స్థాయి శిక్షణ ఇప్పిస్తూ డేగ్రీని కూడా పూర్తి చెయ్యిన్చొచు. అంటే ఇక్క డ మీరు ఇంటర్మీడియేట్ చదివించిన తర్వాత ఒక మంచి కార్పొరేట్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చెయ్యించడానికయ్యే ఖర్చు ఒక యాభై వేల రూపాయలు అయితే, అదే ఖర్చుతో అక్కడ మీ అబ్బాయి లేదా అమ్మాయి ఐ.పి.ఎస్/ఐ.ఏ.ఎస్ + డిగ్రీ రెండు పూర్తి చేస్తారు. ఒక వేళ ఐ.పి.ఎస్/ఐ.ఏ.ఎస్ గా రాలేదనే అనుకుందాం. అక్కడ తీసుకున్న మూడేళ్ళ కోచింగ్ తో చాలా సులభంగా బి.ఎస్.ఆర్.బి/ఆర్.ఆర్.బి ఉద్యోగాల్ని సాధించగలరు. దానికి తోడుగా మీ పిల్లలకు మీ ఆర్ధిక పరిస్థితినీ, వారు ఉద్యోగం చేయాల్సిన అవసరాన్ని క్షుణ్ణంగా అర్ధమయయేటాట్లు చెప్పండి. తద్వారా పిల్లల్లో పట్టుదల పెరిగి చదువు పట్ల ఏకాగ్రత కలిగి, ప్రక్కదారులు పట్టకుండా ఉంటారు. భాద్యతలను గుర్తెరిగి ప్రవర్తిస్తారు. అసలు డిగ్రీ కూడా చదివించే స్తోమత లేకపోతే ఇంటర్మీడియేట్ తో అనేక రకాలయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంభంధించిన కోర్సులు ఎన్.డి.ఏ., నావి, ఏర్ఫోర్స్ లాంటివి అనేకం ఉన్నాయి. వాటికి కోచింగ్ ఇప్పించండి. కనీస ప్రారంభ జీతము 7 వేల రూపాయలకు పైనే ఉంటుంది.
ఇలాంటి వివేకవంతమైన మీ ఆలోచనల ధ్రుక్పధం మీ పిల్లల భవిష్య తుని ఉజ్వాలంగా, మహోన్నతంగా తీర్చి దిద్దాలని అస్సిస్తున్నాను. దీనిలోని అంతరార్ధాన్ని, నేయా ఆర్తినీ ఏ ఒక్క తల్లిదండ్రి అయినా క్షణం సేపు ఆలోచించ గలిగితే అంతకంటే కావాల్సినది ఏముంది..........................
మీ బిడ్దల ఉజ్వాల భవిశ్యథుని కోరే మీ ప్రియ నెస్థమ్......
విజయరామి రెడ్డి
|
|
| | |
|
|
|
|
|
|
|